ఆ హిట్టింగ్‌కు ఈ స్టేడియాలా?

ప్రస్తుత బ్యాటర్ల పవర్‌ హిట్టింగ్‌కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఐపీఎల్‌-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు.

Published : 05 May 2024 02:08 IST

దిల్లీ: ప్రస్తుత బ్యాటర్ల పవర్‌ హిట్టింగ్‌కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఐపీఎల్‌-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. బంతికి బ్యాట్‌కి మధ్య సమతూకం లేదని.. మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతున్నాయని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘పాత తరం స్టేడియాలు ఆధునాతన క్రికెట్‌కు సరిపోవు. ఒకప్పుడు ఉపయోగించే బ్యాట్‌లు వేరు, ఇప్పటి బ్యాట్‌లు వేరు. బౌండరీ లైన్‌ కూడా ఒకప్పటి కన్నా ముందుకు వచ్చేసింది. అందుకే బౌలర్లను బ్యాటర్లు లెక్క పెట్టట్లేదు. ఇదిలా సాగితే క్రికెట్‌పై ఆసక్తి పోతుంది. అయితే బౌలర్లు భిన్నంగా ఆలోచిస్తే కొంత వరకు బ్యాటర్లను కట్టడి చేయచ్చు’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని