Mirabai chanu: మీరాబాయి చానుకు డబుల్‌ ధమాకా 

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మీరాబాయి చానుకు మణిపూర్‌ సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌ భారీ నజరానా ప్రకటించారు. అసాధారణ ప్రతిభతో పతకం సాధించినందుకుగాను ఆమెకు రూ.కోటి నజరానాతో పాటు ఓ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు. ఈ 

Published : 25 Jul 2021 01:30 IST

ఇంఫాల్‌: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మీరాబాయి చానుకు మణిపూర్‌ సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌ భారీ నజరానా ప్రకటించారు. అసాధారణ ప్రతిభతో పతకం సాధించినందుకుగాను ఆమెకు రూ.కోటి నజరానాతో పాటు ఓ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు. ఈ  మేరకు సీఎం.. ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరాబాయి చాను తన విజయానందాన్ని ఆయనతో పంచుకున్నారు.  భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు ఇదో ఆరంభమని,  రాబోయే రోజుల్లో బంగారు పతకాలు సాధిస్తానని చెప్పారు.  

అనంతరం సీఎం బీరెన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు షిల్లాంగ్‌లో ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశంలో నీ గెలుపు గురించి అందరికీ వెల్లడించాను. అక్కడే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఎంతో ఆనందించారు. దేశం గర్వించదగిన విషయమని ప్రశంసించారు. అమిత్‌ షాతో పాటు అంతా నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు’’ అని వివరించారు.  ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్న మీరాబాయి చానుకు ఆ ఉద్యోగానికి బదులుగా మరో కొత్త ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు హామీ ఇచ్చారు. అమిత్‌ షాతో సమావేశమవుతానని, తనకో సర్‌ప్రైజ్‌ ఇస్తాం అంటూ ఆయన పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని