Mohammed Shami: అసూయతో ఎప్పటికీ మంచి ఫలితాలు రాబట్టలేరు: షమీ

వన్డే వరల్డ్‌కప్‌ 2023 (ODI World Cup 2023) సందర్భంగా భారత బౌలర్లపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ హసన్‌ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దీనిపై మహమ్మద్‌ షమీ స్పందించాడు.

Published : 08 Feb 2024 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే వరల్డ్‌కప్‌ 2023 (ODI World Cup 2023) సందర్భంగా భారత బౌలర్లపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ హసన్‌ రజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మహమ్మద్‌ షమీ స్పందించాడు. టోర్నీ సందర్భంగా ఐసీసీ (ICC), బీసీసీఐ (BCCI) భారత బౌలర్లకు మాత్రమే ప్రత్యేక బంతులు ఇస్తోందని.. దానివల్లే బ్యాటింగ్‌ పిచ్‌లపై మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj, షమీ (Mohammed Shami) వేసిన బంతులు ఎక్కువగా స్వింగ్‌ అవుతున్నాయని రజా ఆరోపించాడు. దీనిని వరల్డ్‌ కప్‌ సమయంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా, పాకిస్థాన్‌ మాజీ బౌలర్‌ వసీం అక్రమ్‌లు కూడా వ్యతిరేకించారు.

భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ తాజాగా మరోసారి రజాపై విరుచుకుపడ్డాడు. ‘‘వాళ్లు క్రికెట్‌ను హాస్యాస్పదంగా మార్చారు. మరొకరి విజయాన్ని వాళ్లు ఆనందించలేరు. మిమ్మల్ని ప్రశంసిస్తే సంతోషిస్తారు. కానీ ఓడిపోయినప్పుడు ప్రత్యర్థులు మోసం చేశారని ఆరోపిస్తారు. జట్టుగా మేం సాధించిన విజయాలు, రికార్డులను చూడండి. ఇలాంటి అసూయతో మీరు ఎప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించలేరు’’ అని అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని