MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
టీమ్‌ఇండియా (team india) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (ms dhoni) మ్యాచ్‌ల కోసం సిద్ధమైపోతున్నాడు. ఇప్పుడేమీ మ్యాచ్‌లు లేవు కదా.. అనుకోకండి.. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో మెగా టోర్నీ రాబోతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త. ఈ ఏడాది ఐపీఎల్ (IPL) 2023లో ఆడతాడో లేదోననే ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే వార్త వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ధోనీ బ్యాట్ పట్టాడు. నాలుగుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన మిస్టర్ కూల్.. ఎట్టకేలకు ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రాంచీలోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (JSCA)లో నెట్స్‌లో సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు రవీంద్ర జడేజా కూడా శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకొని మళ్లీ టోర్నీలకు సిద్ధమవుతున్నాడు.
గతేడాది విఫలమైన చెన్నై.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని సీఎస్‌కే సిద్ధమైంది. దానికోసం ఇప్పటికే మినీ వేలంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (రూ.16.25 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆ జట్టులో ధోనీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రుతురాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..