
T20 World Cup: స్కాట్లాండ్‌పై నమీబియా విజయం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశలో స్కాట్లాండ్‌పై నమీబియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జేజే స్మిత్ (32; 23 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు), విలియమ్స్ (23), మైఖేల్ వాన్ లింగెన్ (18) తలో చేయివేయడంతో స్కాట్లాండ్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే ఛేదించింది. స్కాట్లాండ్ బౌలర్లలో లియాస్క్ రెండు, వాట్, గ్రీవ్స్, షరీఫ్, వీల్ తలోవికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌కు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ట్రంపుల్మన్ వేసిన ఈ ఓవర్లో జార్జ్ మున్సీ (0), మెక్ లాయిడ్ (0), రిచర్డ్ బెర్రింగ్టన్ (0) పెవిలియన్ చేరడంతో కష్టాల్లో పడింది. తర్వాత మైఖేల్ లియాస్క్ (44) జట్టును ఆదుకున్నాడు. మాథ్యూ క్రాస్ (19), గ్రీవ్స్ (25) కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో స్కాట్లాండ్ 100 పరుగులు దాటింది. నమీబియా బౌలర్లలో ట్రంపుల్మన్ మూడు, జాన్ ఫ్రైలింక్ రెండు, డేవిడ్ వైస్, స్మిత్ తలో వికెట్ తీశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.