Mohammad Siraj: ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో.. నిరాశకు గురయ్యా

ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో కొంచెం నిరాశకు గురయ్యానని హైదరబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అయితే, జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్..

Published : 17 Sep 2021 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్కు: ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో కొంచెం నిరాశకు గురయ్యానని హైదరబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. అయితే, జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదని పేర్కొన్నాడు. ‘టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనేది నా కల. అయితే, జట్టు ఎంపిక మన చేతిలో లేదు. జట్టులో చోటు దక్కనంత మాత్రాన కెరీర్ ముగిసిపోయినట్లు కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతాను. ఫార్మాట్‌ ఏదైనా జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషిస్తాను’ అని సిరాజ్‌ చెప్పాడు.

ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్‌ పర్యటన తనకెన్నో విషయాలను నేర్పించిందని సిరాజ్‌ అన్నాడు. ‘సీనియర్ బౌలర్లు ఇశాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమిలతో కలిసి బౌలింగ్ చేయడం మరిచిపోలేని అనుభవం. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి నన్ను ప్రొత్సహించారు. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవి శాస్త్రిలకు నా ప్రదర్శనపై నమ్మకం ఏర్పడింది’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో సిరాజ్‌ 8 వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని