- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Rishabh Pant: పంత్ ఓపెనర్‌గా వస్తే..విధ్వంసమే : గావస్కర్
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ రిషభ్ పంత్ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి దూసుకొచ్చాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్లో దూకుడైన ఆటతో ఆకట్టుకుంటున్న పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం రాణించట్లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. పంత్ ఆటపై ఓ క్రీడాఛానల్‌లో దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
‘‘పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా రావడమే మంచి నిర్ణయమని భావిస్తున్నా. ఎందుకంటే వైట్‌బాల్ క్రికెట్లో ఆస్ట్రేలియాకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా చెలరేగి ఆడేవాడు. టెస్టుల్లో యథావిధిగా ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొట్టేవాడు. అతడిలానే టీమ్ఇండియాకు రిషభ్ పంత్ ఉన్నాడు. ముఖ్యంగా టీ20ల్లో పంత్ ఓపెనర్‌గా ఉంటే వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం దక్కుతుంది. అప్పుడు మనం అతడి బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూడగలం’’అని గావస్కర్ తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sisodia: కేంద్రం కూడా కాదట.. మరి ఆ నిర్ణయం ఎవరిది?
-
India News
Anand Mahindra: వాసుకిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా..!
-
General News
Andhra News: యాప్ వివాదం.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు విఫలం
-
Movies News
OTT Movies: 8వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్‌రాజు
-
Politics News
Munugode: మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Thiru review: రివ్యూ: తిరు
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో