IPL 2022 : ఐపీఎల్‌ కోసం బంగ్లాతో టెస్టు సిరీస్‌ వద్దనుకుని..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌ పోటీల కోసం ..

Published : 16 Mar 2022 10:21 IST

భారత్‌కు రానున్న దక్షిణాఫ్రికా బౌలర్లు!

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌ పోటీల కోసం అంతర్జాతీయ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. తమ దేశం తరఫున ఆడాల్సిన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇప్పటికే కొంతమంది భారత్‌కు చేరుకోగా.. మరికొందరు మాత్రం ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టాప్‌ బౌలర్లు కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జాన్‌సెన్ తదితరులు బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో పాల్గొనకుండా ఐపీఎల్‌ కోసం రానున్నట్లు సమాచారం.

మార్చి 18, మార్చి 20, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అనంతరం మార్చి 31 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్‌లో పాల్గొన్న తర్వాత ఐపీఎల్‌ ఫ్రాంచైజీలతో కలిసేందుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండబోమని ఇప్పటికే దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుకు తెలిపినట్లు సమాచారం. ఐపీఎల్‌ మెగా వేలంలో జాన్‌సెన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రబాడను పంజాబ్ కింగ్స్, ఎంగిడిని దిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. మరో ఫాస్ట్‌బౌలర్‌ ఆన్రిచ్‌ నార్జ్‌ రాకపై సందిగ్ధత నెలకొంది. గాయపడిన నార్జ్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే ఆడే అవకాశం ఉంది. నార్జ్‌ను దిల్లీ రిటెయిన్‌ చేసుకుంది. మార్చి 26 నుంచి ముంబయి వేదికగా ఐపీఎల్ -15వ సీజన్‌ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు