అర్జున్‌కు తొలి విజయం

సూపర్‌బెట్‌ చెస్‌ టోర్నమెంట్లో ర్యాపిడ్‌లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్‌ తొలి విజయాన్ని అందుకున్నాడు.

Published : 10 May 2024 03:28 IST

వార్సా: సూపర్‌బెట్‌ చెస్‌ టోర్నమెంట్లో ర్యాపిడ్‌లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్‌ తొలి విజయాన్ని అందుకున్నాడు. గురువారం ఆరో రౌండ్లో  షెవ్‌చెంకో (రొమేనియా)ను అర్జున్‌ ఓడించాడు. అంతకుముందు కార్ల్‌సన్‌, వియ్‌యీ (చైనా)లతో గేమ్‌లను అర్జున్‌ డ్రా చేసుకున్నాడు. తొలి రోజు మూడు రౌండ్లలో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న దొమ్మరాజు గుకేశ్‌.. రెండో రోజు నాలుగో రౌండ్లో సహచర ఆటగాడు ప్రజ్ఞానందను ఓడించాడు. తర్వాత విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ)పై నెగ్గాడు. ఆరో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో డ్రా చేసుకున్నాడు. మరోవైపు డుడా (పోలెండ్‌)తో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. షెవ్‌చెంకో, గుకేశ్‌ చేతిలో ఓడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని