బజ్‌రంగ్‌పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్‌

డోపింగ్‌ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్‌ వేటు వేసింది.

Published : 10 May 2024 03:29 IST

దిల్లీ: డోపింగ్‌ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ ఏడాది చివరి వరకు అతడిపై ఈ సస్పెన్షన్‌ కొనసాగుతుంది. ఇదే కారణంతో మొదట ఏప్రిల్‌ 23న జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) బజ్‌రంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. తాను పరీక్ష చేయించుకోవడానికి ఎప్పుడూ నిరాకరించలేదని.. కానీ పరీక్ష కోసం అధికారి తెచ్చిన కిట్‌ గడువు ముగిసినందువల్లే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు బజ్‌రంగ్‌ వెల్లడించాడు. తనను సస్పెండ్‌ చేసినట్లు యూడబ్ల్యూడబ్ల్యూ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని