భారత్‌ క్లీన్‌స్వీప్‌

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 21 పరుగుల తేడాతో నెగ్గింది.

Published : 10 May 2024 03:27 IST

అయిదో టీ20లోనూ బంగ్లాపై విజయం

సిల్హెట్‌: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 21 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట భారత్‌ 5 వికెట్లకు 156 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (33; 25 బంతుల్లో 4×4, 1×6), హేమలత (37; 28 బంతుల్లో 2×4, 2×6), హర్మన్‌ప్రీత్‌ (30; 24 బంతుల్లో 4×4), రిచా ఘోష్‌  (28 నాటౌట్‌; 17 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. అనంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాధ యాదవ్‌ (3/24), ఆశ శోభన (2/25)ల ధాటికి బంగ్లా 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది.


మనిక జోరుకు తెర

జెడ్డా: గ్రాండ్‌స్మాష్‌ టీటీ టోర్నమెంట్లో భారత స్టార్‌ మనిక బత్రా సంచలనాలకు తెరపడింది. రెండో రౌండ్లో ప్రపంచ నంబర్‌-2 వాంగ్‌ మన్‌యూను కంగుతినిపించిన మనిక.. ప్రిక్వార్టర్స్‌లో 14వ ర్యాంకర్‌ నినా మిటిల్‌హమ్‌కు షాకిచ్చినా.. క్వార్టర్స్‌లో ఓడిపోయింది. మనిక 11-7, 6-11, 4-11, 11-13, 2-11తో అయిదో ర్యాంకర్‌ హినా హయటా (జపాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది.


భారత షూటర్లు విఫలం

దిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్ల వైఫల్యం కొనసాగుతోంది. బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం పురుషులు, మహిళల స్కీట్‌లో భారత క్రీడాకారులెవరూ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. పురుషుల విభాగంలో అనంత్‌జీత్‌ సింగ్‌ 15, షీరజ్‌ షేక్‌ 54, మైరాజ్‌ అహ్మద్‌ఖాన్‌ 76వ స్థానాల్లో నిలిచారు. మహిళల్లో రైజా ధిల్లాన్‌ 16, మహేశ్వరి చౌహాన్‌ 20, గనేమత్‌ షెఖాన్‌ 25వ స్థానాలు సాధించారు. అంతకుముందు భారత ట్రాప్‌ షూటర్లు కూడా ఫైనల్‌ చేరడంలో విఫలమయ్యారు. పురుషుల విభాగంలో వివాన్‌ కపూర్‌కు ఫైనల్‌ బెర్తు త్రుటిలో చేజారింది. ఆరుగురు ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉండగా.. వివాన్‌ ఏడో స్థానం సాధించాడు. పృథ్వీ తొండమాన్‌ 24, భోనీష్‌ 39, జొరావర్‌సింగ్‌ 52వ స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో రాజేశ్వరి కుమారి 23వ స్థానం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు