IND vs BAN: బంగ్లాతో వన్డేకు పంత్ దూరం.. కారణం ఇదే: బీసీసీఐ
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ జట్టులో రిషభ్ పంత్ లేకపోవడానికి గల కారణాలను బీసీసీఐ వివరించింది.
ఢాకా: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. పంత్ స్థానంలో మరే ఇతర ఆటగాడిని తీసుకోలేదంటూ తెలిపింది. ఈ సిరీస్ అనంతరం టెస్టు సిరీస్‌లో అతడు తిరిగి పాల్గొంటాడని పేర్కొంది.
‘‘బీసీసీఐ వైద్యుడిని కలిసేందుకు తీసుకున్న అపాయింట్‌మెంట్ కారణంగా రిషభ్ పంత్ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడటం లేదు. రానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు తిరిగి జట్టులో చేరతాడు. అక్షర్ పటేల్ సైతం అందుబాటులో లేడు. ప్రస్తుతం పంత్ స్థానంలో మరే ఇతర ఆటగాడిని తీసుకోలేదు’’ అంటూ బీసీసీఐ వివరణ ఇచ్చింది. ఈ ట్వీట్‌పై పంత్ అభిమానులు స్పందిస్తూ.. అతడికి నిజంగానే కాస్త విరామం అవసరమంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సంజూ శాంసన్ అభిమానులు మాత్రం బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. కనీసం పంత్ స్థానంలో ఆడటానికైనా సంజూ శాంసన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వెన్ను గాయం కారణంగా సీనియర్ పేసర్ షమీ సైతం ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. పంత్ స్థానంలో సిరీస్ ఓపెనర్ బాధ్యతలను కెప్టెన్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్‌కి అప్పగించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు