Rishabh Pant: పంత్‌ ఓపెనర్‌గా వస్తే..విధ్వంసమే : గావస్కర్‌

భారత యువ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన

Published : 08 Jul 2022 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లోకి దూసుకొచ్చాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో దూకుడైన ఆటతో ఆకట్టుకుంటున్న పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం రాణించట్లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. పంత్‌ ఆటపై ఓ క్రీడాఛానల్‌లో దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

‘‘పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా రావడమే మంచి నిర్ణయమని భావిస్తున్నా. ఎందుకంటే వైట్‌బాల్‌ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఓపెనర్‌గా చెలరేగి ఆడేవాడు. టెస్టుల్లో యథావిధిగా ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొట్టేవాడు. అతడిలానే టీమ్‌ఇండియాకు రిషభ్‌ పంత్‌ ఉన్నాడు. ముఖ్యంగా టీ20ల్లో పంత్ ఓపెనర్‌గా ఉంటే వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం దక్కుతుంది. అప్పుడు మనం అతడి బ్యాట్‌ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూడగలం’’అని గావస్కర్‌ తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని