IPL 2021: పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరు విజయం..

చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 03 Oct 2021 19:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (57) అర్ధ శతకంతో రాణించినా పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. కెప్టెన్‌ రాహుల్‌ (39), మార్‌క్రమ్‌ (20) ఫర్వాలేదనిపించారు. షారుక్‌ ఖాన్‌ (16) చివరి ఓవర్లో ఔటయ్యాడు. నికోలస్ పూరన్‌ (3), సర్ఫరాజ్‌ (0) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో యుజువేంద్ర చాహల్‌ మూడు వికెట్లు, షాబాజ్‌ అహ్మద్‌, జార్జ్‌ గార్టన్ తలో వికెట్‌ తీశారు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (40), విరాట్‌ కోహ్లి (25) శుభారంభం చేశారు. డి విలియర్స్‌ (23) ఫర్వాలేదనిపించాడు. షాబాజ్‌ అహ్మద్ (8) ఆకట్టుకోలేకపోయాడు. డేనియల్ క్రిస్టియన్‌ (0), జార్జ్‌ గార్టన్‌ (0) డకౌటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో హెన్రిక్స్‌ మూడు, మహమ్మద్‌ షమి మూడు వికెట్లు తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని