Shardul Thakur: శార్దూల్‌కు ‘లగేజీ’ టెన్షన్.. హర్భజన్‌ సూపర్ రెస్పాన్స్‌

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిశాక టీమ్‌ఇండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌ ఇవాళ ముంబయికి చేరుకొన్నాడు. అయితే అతడిపాటు లగేజీ రాకపోవడంతో  నిరుత్సాహానికి గురయ్యాడు. సాయం అందించమని వెంటనే సోషల్‌ మీడియా వేదికగా కోరాడు.

Updated : 12 Oct 2022 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది నిర్వాకానికి టీమ్‌ఇండియా ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు. నిన్న దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్‌ అనంతరం ఇవాళ ఉదయం దిల్లీ నుంచి ముంబయికి శార్దూల్ చేరుకొన్నాడు. అయితే తన లగేజీ ఇంకా రాలేదని వాపోయాడు. దీంతో కిట్‌ బ్యాగ్‌లు అందించాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. సమయానికి లగేజీ ఇలా రాకపోవడం ఇదే మొదటిసారి కాదని.. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరాడు. 

‘‘లగేజ్‌ బెల్ట్‌ వద్దకు ఎవరినైనా సాయంగా పంపిస్తారా..? నా కిట్‌ బ్యాగులు సమయానికి రాకపోవడం ఇదేమీ మొదటి సారి కాదు. అక్కడ సిబ్బంది ఎవరూ లేరు’’ అని శార్దూల్ పోస్టు పెట్టాడు. తాను ఏ టెర్మినల్‌ నుంచి వచ్చింది కూడా అందులో మెన్షన్‌ చేశాడు. ఈ క్రమంలో హర్భజన్‌ సింగ్‌ వెంటనే స్పందించాడు. ‘‘మై డియర్.. త్వరగానే మీ సమస్యను పరిష్కరిస్తాం. మా సిబ్బంది తప్పక సాయం అందిస్తారు. మీకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం (ఎయిర్‌ఇండియా మాజీ ఉద్యోగి భజ్జీ). వుయ్‌ లవ్‌ యూ’’ అని అధికారిక స్టేట్‌మెంట్‌లా రిప్లై ఇచ్చాడు. అయితే భజ్జీ స్పందనకు శార్దూల్‌ ఠాకూర్‌ కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘భజ్జీ లవ్‌ యూ టూ.. విమాన సంస్థ సిబ్బంది నుంచి సాయం అందింది’’ అని ట్వీట్ చేశాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని