NZ vs IND: సంజూ శాంసన్‌ను తీసుకోకపోవడానికి కారణమిదే: శిఖర్ ధావన్
కివీస్‌తో వర్షం కారణంగా రద్దు అయిన రెండో వన్డేలో సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్‌కు భారత్ తుది జట్టులో స్థానం దక్కలేదు. తొలి వన్డేలో రాణించిన సంజూను పక్కన పెట్టడంపై కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది. అయితే కీలకమైన రెండో వన్డేలో సంజూ శాంసన్‌ను భారత్ పక్కన పెట్టడంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంజూను తుది జట్టులో తీసుకోకపోవడంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చేశాడు.
‘‘మాకు ఆరో బౌలర్ ఆప్షన్ ఉంటే బాగుంటుందని భావించాం. అందుకే సంజూ శాంసన్ బదులు దీపక్ హుడాను తీసుకొన్నాం. అలాగే చాహర్ వికెట్‌కు రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సమర్థుడు. అందుకే చాహర్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశాం. అయితే మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. అన్నీ మన నియంత్రణలో ఉండవు. పిచ్ మాత్రం బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా అనిపించింది. శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడాడు. ఇక చివరి వన్డేపై దృష్టిసారిస్తాం. మా జట్టులో చాలా మంది రెస్ట్‌లో ఉన్నారు. అయినప్పటికీ చాలా బలంగా ఉన్నాం. మా స్క్వాడ్ ఆటతీరును పరిశీలిస్తే తెలిసిపోతుంది. టీమ్‌ఇండియాను నడిపించడం ఎప్పుడూ గర్వకారణమే. నేను కుర్రాడిగా మారిపోయినట్లు అనిపించింది. మా యువ ఆటగాళ్లు మాత్రం అదరగొట్టేస్తున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని ధావన్ వెల్లడించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్