Naatu Naatu: నరేంద్ర మోదీ స్టేడియంలో ‘నాటు నాటు’ సెలబ్రేషన్స్‌.. డ్యాన్స్‌ చేసిన గావస్కర్‌..

‘నాటు నాటు’(Naatu Naatu) పాట ఆస్కార్‌ (oscars 2023)సెలబ్రేషన్స్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికైంది. ఈ పాటకు దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) కాలు కదిపి సంతోషం వ్యక్తం చేశారు.

Updated : 14 Mar 2023 12:16 IST

(ఫొటో : స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు)

ఇంటర్నెట్‌డెస్క్‌:  ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) ‘నాటు నాటు’(Naatu Naatu) సెలబ్రేషన్సే. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు(oscars 2023) దక్కించుకుని ప్రపంచవేదికపై సత్తా చాటిన ఈ పాటకు ప్రతి ఒక్కరూ కాలు కదుపుతున్నారు. ఈ ఫీవర్‌ ఇప్పుడు క్రికెట్‌కూ పాకింది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు ఈ పాటకు ఫిదా కాగా.. తాజాగా మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) ఇందులో భాగమయ్యారు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు(IND vs AUS) ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు స్టేడియంలో ఈ పాటపై స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు క్రీడా ఛానల్‌తో గావస్కర్‌ మాట్లాడారు.

ఈ పాటకు ఆస్కార్‌ దక్కడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ ఘనత సాధించడంలో ప్రతి ఒక్కరి  కృషిని కొనియాడారు. ఈ సినిమా తాను చూశానని.. ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ పాట సెలబ్రేషన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా ఉంటాయని చెప్పారు. ఇక ఈ పాటకు స్టెప్పులేసి తనలో ఉన్న ఉత్సాహాన్ని సన్నీ చాటారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ ఛానల్‌ ట్విటర్‌లో పంచుకుంది.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ(border gavaskar trophy)లో చివరిదైన ఈ టెస్టు ఎలాంటి ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌లోకి కూడా టీమ్‌ఇండియా దూసుకుపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని