Sunil Gavaskar: రాహుల్‌ తెవాతియాను ఎంపిక చేయాల్సింది: గావస్కర్

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో గుజరాత్‌ జట్టుకు పలు కీలక విజయాలు అందించిన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రాహుల్‌ తెవాతియాను ఐర్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేయాల్సిందని...

Updated : 21 Jun 2022 14:51 IST

(Photo: Rahul Tewatia Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో గుజరాత్‌ జట్టుకు పలు కీలక విజయాలు అందించిన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రాహుల్‌ తెవాతియాను ఐర్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేయాల్సిందని మాజీ కెప్టెన్‌, బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అతడు ఈ మెగా టోర్నీలో ఓడిపోయే మ్యాచ్‌లను గెలిపించాడని గుర్తు చేశాడు. గావస్కర్‌ ఇటీవల ఓ క్రీడాఛానల్లో మాట్లాడుతూ తెవాతియా ఆటతీరును మెచ్చుకున్నాడు.

‘తెవాతియా చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతడిని ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేయాల్సింది. ఈ సిరీస్‌లో అతడిని అదనపు ఆటగాడిగా తీసుకోవాల్సింది. ఇటీవల మంచి ప్రదర్శన చేసిన అతడిని ఇలా వదిలేయడం సరికాదు. గుజరాత్‌ తరఫున గొప్పగా ఆడాడు. ఓడిపోయే మ్యాచ్‌లను గెలిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో బరిలోకి దిగి.. దొరికిన బంతిని దొరికినట్లు ఉతికారేశాడు. దీంతో ఆ జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. అతడు ఆన్‌సైడ్‌ మాత్రమే కాకుండా ఆఫ్‌సైడ్‌ కూడా చాలా మంచి షాట్లు ఆడాడు. అలాంటి టెంపర్మెంట్‌ చూపించే ఆటగాడిని కచ్చితంగా ఈ పర్యటనకు ఎంపిక చేయాల్సింది. అతడి ఆటతీరును గుర్తించాల్సింది. అలా చేయడం అనేది.. అతడు మరింత కష్టపడితే జాతీయ జట్టులోకి వస్తాడనే నమ్మకాన్ని కలిగించడమే’ అని గావస్కర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని