SKY-DK: డీకే నా నాలుగో స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడే: సూర్యకుమార్‌

గత కొన్ని మ్యాచుల్లో నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అయితే దక్షిణాఫ్రికాతో ఆఖరి టీ20 మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా దినేశ్ కార్తిక్‌ దిగడం గమనార్హం. అక్కడా డీకే వీరవిహారం చేశాడు.

Published : 06 Oct 2022 01:41 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో ఆఖరి టీ20లో హార్డ్‌ హిట్టర్ దినేశ్‌ కార్తిక్‌ కొత్తగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికీ డగౌట్‌లో సూర్యకుమార్‌ ఉన్నప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ దినేశ్‌ కార్తిక్‌ను బ్యాటింగ్‌కు పంపాడు. కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు బాదేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓడినా.. కార్తిక్‌ ఇన్నింగ్స్‌ మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్‌ కూడా కార్తిక్‌ బ్యాటింగ్‌కు ఆశ్చర్యపోయాడు. ఇలాగే ఆడితే తన నాలుగో స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడని సరదా వ్యాఖ్యలు చేస్తూ కార్తిక్‌ ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు. అలాగే సూర్యకుమార్‌ ఈ ఏడాది 50 సిక్స్‌లను బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

‘‘ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో 50 సిక్స్‌లు కొట్టడంపై నేను ఆలోచించలేదు. మీరు అడిగే వరకు స్టాట్స్‌ కూడా చెక్ చేయలేదు. వాట్సాప్‌లో నా స్నేహితుడు వాటిని పంపాడు. అయితే వాటిని నేను పట్టించుకోను. కేవలం ఆటను ఎంజాయ్‌ చేయడమే నాకు తెలుసు. ఇక దినేశ్ కార్తిక్‌ చాలా బాగా ఆడాడు. ఇలానే ఆడితే మాత్రం నా నంబర్‌ 4 స్థానానికి (నవ్వుతూ) ముప్పు తప్పదు. అయితే దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు’’ అని సూర్యకుమార్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని