Updated : 06 Nov 2021 19:42 IST

T20 World Cup: వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కీలక సమయాల్లో తానెంత ప్రమాదకరంగా ఆడతాడో మరోసారి డేవిడ్‌ వార్నర్‌ (89*) నిరూపించాడు. సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అన్ని రంగాల్లో రాణించి వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్‌ పొలార్డ్‌ (44), లూయిస్‌ (29), హెట్మెయిర్ (27) రాణించారు. అనంతరం ఆసీస్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 161 పరుగులు (16.2 ఓవర్లలో) చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ సారథి ఆరోన్‌ ఫించ్‌ (9) విఫలం కాగా. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ (53) అర్ధశతకాలతో విండీస్‌ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు శతకం (122) పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఆఖర్లో మిచెల్‌ ఔటైనా.. మ్యాక్స్‌వెల్‌ (0*)తో వార్నర్‌ ముగించేశాడు. విండీస్‌ బౌలర్లలో అకీల్‌, గేల్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ (8 పాయింట్లు: +3.183 రన్‌రేట్), ఆసీస్‌ (8), దక్షిణాఫ్రికా (6) వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ విజయంతో ఆసీస్‌ రన్‌రేట్‌ (+1.216) సౌతాఫ్రికా రన్‌రేట్‌ (+0.742)ను దాటేసింది. ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా (ప్రొటీస్) మ్యాచ్‌ ఫలితంపై ఆసీస్‌ సెమీస్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. 

పొలార్డ్‌ ఫర్వాలేదు.. నడ్డివిరిచిన హేజిల్‌వుడ్

మొదట బ్యాటింగ్‌ను దూకుడుగా ప్రారంభించిన విండీస్‌.. ఆఖరి వరకు అదే ఊపును కొనసాగించలేకపోయింది. దీనికి కారణం ఆసీస్‌ బౌలర్‌ హేజిల్‌వుడ్ (4/39). స్వల్ప వ్యవధిలో వికెట్లను తీస్తూ విండీస్‌ భారీ స్కోరు సాధించకుండా చేయడంలో సఫలమయ్యాడు. ఓపెనర్లు క్రిస్‌ గేల్ (15), లూయిస్‌ (29) తొలి వికెట్‌కు 2.2 ఓవర్లలోనే 30 పరుగులు రాబట్టారు. అయితే గేల్‌ ఔటయ్యాక వచ్చిన పూరన్‌ (4), రోస్టన్‌ ఛేజ్‌ (0) వరుసగా పెవిలియన్‌కు చేరడంతో విండీస్‌ ఇబ్బందుల్లో పడింది. అయితే లూయిస్‌తో కలిసి హెట్మెయిర్ (27) ఇన్నింగ్స్‌ను కాస్త నిలబెట్టినా.. మరోసారి ఒత్తిడి లోనై వికెట్లను చేజార్చుకున్నారు. అయితే పొలార్డ్‌ (44), రస్సెల్‌ (18*) బ్యాట్‌ను ఝళిపించడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆఖరి మ్యాచ్ ఆడుతున్న డ్వేన్‌ బ్రావో (10) ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 4.. స్టార్క్‌, జంపా, కమిన్స్‌ తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని