T20 worldcup: ఐపీఎల్‌ దారిలోనే టీ20 ప్రపంచకప్‌!

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో భారత్‌లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి మార్చే అవకాశాలున్నాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేదికను అక్కడికి మార్చే అవకాశాలపై పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆటగాళ్ల ఆరోగ్యం,..

Updated : 26 Jun 2021 16:39 IST

త్వరలో అధికారిక ప్రకటన: జై షా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో భారత్‌లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి మార్చే అవకాశాలున్నాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేదికను అక్కడికి మార్చే అవకాశాలపై పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని.. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని షా పేర్కొన్నారు. వేదిక మార్పుపై త్వరలోనే అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఐపీఎల్‌ 14వ సీజన్‌ సైతం కరోనా కేసుల కారణంగానే వాయిదా పడింది. ఆ మెగా టోర్నీని కూడా యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 మధ్య ఐపీఎల్‌ నిర్వహించాలని చూస్తోంది. దీని తర్వాత అక్కడే పొట్టి ప్రపంచకప్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని