BCCI video on KL Rahul: శెభాష్‌.. కేఎల్‌ రాహుల్‌! డ్రస్సింగ్‌ రూమ్‌లో సందడే సందడి

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకం చేసిన కేఎల్‌ రాహుల్‌ (127*; 248 బంతుల్లో 12×4, 1×6)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంగ్లేయులపై అతడి బ్యాటింగ్‌ అద్భుతమని అందరూ పొగిడేస్తున్నారు.....

Published : 13 Aug 2021 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకం చేసిన కేఎల్‌ రాహుల్‌ (127*; 248 బంతుల్లో 12×4, 1×6)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంగ్లేయులపై అతడి బ్యాటింగ్‌ అద్భుతమని అందరూ పొగిడేస్తున్నారు. ముఖ్యంగా జిమ్మీ అండర్సన్‌ను ఎదుర్కొన్న తీరును అభినందిస్తున్నారు.

ఉదయం వర్షం కురవడం, ఆకాశంలో మబ్బులు కమ్మేయడంతో ఇంగ్లాండ్‌ తెలివిగా బౌలింగ్‌ ఎంచుకుంది. చల్లని పరిస్థితుల్లో స్వింగ్‌కు టీమ్‌ఇండియా ఉక్కిరి బిక్కిరి అవుతుందని భావించింది. దూరంగా వెళ్లే బంతులను ఆడలేక ఆటగాళ్లు క్యాచులు ఇస్తారని అనుకుంది.

కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ వారి అంచనాలను తలకిందులు చేశారు. తిరుగులేని శతక భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ ముంగిట హిట్‌మ్యాన్‌ పెవిలియన్ చేరినా రాహుల్‌ తనదైన శైలిలో సొగసరి స్ట్రోక్‌ప్లేతో అజేయ శతకం సాధించాడు. ఆట ముగిశాక డ్రస్సింగ్‌ రూమ్‌కు వస్తున్నప్పుడు సహచరుల నుంచి అతడికి ఘన స్వాగతం లభించింది. ప్రతి ఒక్కరు అభినందనల్లో ముంచెత్తారు. బీసీసీఐ ట్వీట్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని