Bhavinaben Patel: భవినాబెన్‌ చరిత్ర.. పారాలింపిక్స్‌ క్వార్టర్స్‌కు భారత ప్యాడ్లర్‌

భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవినాబెన్‌ పటేల్‌ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. పారాలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత తొలి ప్యాడ్లర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది....

Published : 27 Aug 2021 13:52 IST

టోక్యో: భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవినాబెన్‌ పటేల్‌ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. పారాలింపిక్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత తొలి ప్యాడ్లర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్‌ క్లాస్‌-4 ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3-0 తేడాతో బ్రెజిల్‌ అమ్మాయి జాయ్‌సి డి ఒలివెరియాను చిత్తు చేసింది. 23 నిమిషాల పాటు జరిగిన మ్యాచులో వరుసగా 12-10, 13-11, 11-6తో మూడు గేముల్లో విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఆమె ప్రపంచ రెండో ర్యాంకర్‌ బొరిస్‌లవ పెరిక్‌ రంకోవిచ్‌ (సెర్బియా)తో తలపడనుంది.

‘నా ప్రత్యర్థి దేహం వైపు బంతిని పంపించడమే నా ప్రధాన వ్యూహం. నా కోచ్‌ ఇదే చెప్పాడు. నేను కచ్చితత్వంలో ఆ ప్రణాళిక అమలు చేశాను. నా తర్వాతి ప్రత్యర్థి ప్రపంచ రెండో ర్యాంకర్‌. అందుకే నేనా మ్యాచ్‌ను పూర్తి ఏకాగ్రతతో ఆడాలి. గెలిచేందుకు ప్రయత్నించాలి’ అని భవినా తెలిపింది. తొలిరౌండ్లో ఓడిన ఆమె రెండో రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. క్లాస్‌-4 విభాగంలో క్రీడాకారుల దేహం దిగువభాగం పనిచేయదు. వారు చక్రాల కుర్చీకే పరిమితమై ఆడాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని