Novak Djokovic: కంటతడి పెట్టి.. రాకెట్ నేలకేసి కొట్టి..! ఓటమి తర్వాత జకోవిచ్ స్పందన
యూఎస్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌తో తలపడిన తుదిపోరులో జకోవిచ్ 6-4, 6-4, 6-4 తేడాతో విఫలమయ్యాడు...
ఇంటర్నెట్‌డెస్క్: యూఎస్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్‌తో తలపడిన తుదిపోరులో 6-4, 6-4, 6-4 తేడాతో విఫలమయ్యాడు. దీంతో ఈ ఏడాది ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ సాధించి చరిత్ర సృష్టించాలని కలలు కన్న అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఒక దశలో తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. మెద్వెదేవ్‌తో ఓటమిపాలయ్యాక తన రాకెట్‌ను నేలకేసి కొట్టి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పుడా వీడియోలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి.
జకోవిచ్ ఈ ఏడాది తొలుత ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆపై వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లోనూ విజయం సాధిస్తాడని ఆశించినా అది జరగలేదు. దీంతో గోల్డెన్ గ్రాండ్‌స్లామ్ ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు యూఎస్ ఓపెన్‌లోనైనా గెలుపొంది కనీసం ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ సాధిస్తాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాగా, జకోవిచ్ ఇప్పటివరకు అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, నాదల్ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామని ఉవ్విళ్లూరుతున్న అతడికి ఇదెంతో బాధ కలిగించింది.
టోర్నీ అనంతరం జకోవిచ్ మాట్లాడుతూ.. ఈ టైటిల్ కోసం తాను కొన్ని వారాలుగా మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పాడు. అలాంటి కఠిన పరిస్థితుల్లోనే సన్నద్ధమవ్వాల్సి వచ్చిందన్నాడు. ఆ మానసిక సంఘర్షణను తట్టుకోవడం చాలా కష్టమైందని తెలిపాడు. చివరికి ఈ పోరు ముగిసిపోయినందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే, ఈ ఓటమి తనను తీవ్రంగా కలచివేసిందన్నాడు. తన కోసం సమయం కేటాయించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. ఇక మెద్వెదేవ్ మాట్లాడుతూ అభిమానులకు, జకోవిచ్‌కు క్షమాపణలు చెప్పాడు. జకోవిచ్ చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమైనా.. తాను ఆ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేశానని పేర్కొన్నాడు. టెన్నిస్ చరిత్రలో జకోవిచ్ అతిగొప్ప ఆటగాడని మెచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!