
Australia: ఆసీస్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. వైస్ కెప్టెన్‌గా స్మిత్
(Photo: Cricket Australia Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథిగా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ఉదయం ప్రకటించింది. అతడికి స్టీవ్‌స్మిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. గతవారం మాజీ సారథి టిమ్‌పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. 2017లో అతడు తన సహచర ఉద్యోగికి అసభ్యకరమైన సందేశాలు పంపాడని తేలడంతో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దీంతో కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే, అందరూ అనుకున్నట్లే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ జట్టు పగ్గాలు అందుకున్నాడు.
అతడిని ఐదుగురితో కూడిన సెలెక్షన్ ప్యానెల్ ఇంటర్వ్యూ చేసి మరీ ఎంపిక చేసిందని, దీంతో ఆస్ట్రేలియా తరఫున ఫుల్‌టైమ్ కెప్టెన్సీ చేపట్టిన తొలి బౌలర్‌గా కమిన్స్ నిలిచాడని పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన అతడు.. ఈ బాధ్యతలు స్వీకరించడం తనకు గౌరవప్రదమని తెలిపాడు. టిమ్‌పైన్ జట్టుకు ఎలాంటి సేవలందించాడో తాను అలాగే పనిచేస్తానన్నాడు. జట్టులో ఉన్న సీనియర్లు, జూనియర్లతో కలిసి ముందుకు సాగుతానన్నాడు. కాగా, డిసెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ కమిన్స్‌కు తొలి పరీక్షగా నిలవనుంది. మరోవైపు టిమ్‌పైన్ కొద్దికాలం అన్ని ఫార్మాట్ల ఆటకు దూరంకానున్నాడని తెలిసింది. ఈ మేరకు క్రికెట్ తస్మానియా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. దీంతో అతడు యాషెస్ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.