IND vs SA : లంచ్‌ బ్రేక్‌.. రిషభ్‌పంత్‌ హాఫ్ సెంచరీ.. ఆసక్తికరంగా మ్యాచ్‌

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్‌..

Published : 13 Jan 2022 16:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా మారుతోంది. సఫారీల బౌలింగ్‌ను ఎదుర్కొని రిషభ్‌ పంత్‌ (51*) అర్ధశతకం సాధించాడు. దీంతో మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషభ్‌ పంత్‌తోపాటు విరాట్ కోహ్లీ (28*) ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఎంతో నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు జాన్‌సెన్, రబాడ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత్ లీడ్‌ 143 పరుగులకు చేరింది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 223/10 కాగా.. దక్షిణాఫ్రికా స్కోరు 210/10.

ఆరంభంలోనే షాక్.. అయినా

ఓవర్‌నైట్‌ 57/2 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఇవాళ తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఛెతేశ్వర్‌ పుజారా (9) జాన్‌సెన్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతిని ఆడబోయి పీటర్సెన్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె (1) మరోసారి విఫలమయ్యాడు. దీంతో అతడి భవితవ్యంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నట్లే. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్‌ కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే విరాట్ కోహ్లీ, పంత్ జోడీ అర్ధశతక (72) భాగస్వామ్యం నిర్మించి పట్టు నిలిపింది. అంతేకాకుండా మరో వికెట్‌ పడనీయకుండా తొలి సెషన్‌ను ముగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని