
Pujara - Malik : పుజారా పునరాగమనం నమ్మశక్యం కాని విషయం: ఎంఎస్కే ప్రసాద్
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్ఇండియా జట్టులోకి తీసుకోవడం మంచి పరిణామమని బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అభినందించాడు. అలానే అతడిని ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించాడు. ఛెతేశ్వర్ పుజారా మళ్లీ టెస్టు జట్టులోకి రావడం నమ్మశక్యంగా లేదన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై శ్రీలంకతోనూ జట్టులో స్థానం కోల్పోయిన పుజారా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో అదరగొట్టాడు. దీంతో మరోసారి టెస్టు జట్టులోకి పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఉమ్రాన్, పుజారా జట్టులోకి రావడంపై ఎంఎస్కే మాట్లాడాడు.
‘‘పుజారా రాకపై ఒకే మాట చెప్పగలను. ఇది నమ్మశక్యం కానిది. ఇంతే ఇంకేమీ చెప్పలేను. ఆటపట్ల ఉన్న కమిట్మెంట్ పుజారాలో కనిపిస్తోంది. దీని కోసం పుజారా చేసిన కృషి చాలా మంది నమ్మరు. కౌంటీల్లో చెలరేగడంతో టెస్టు జట్టులోకి అవకాశం వచ్చింది. అతడు ఎప్పుడూ టెస్టు క్రికెటర్‌గానే ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విఫలం చెందాక పుజారా మళ్లీ జట్టులోకి రావడం కష్టమేనని చాలా మంది భావించారు. అయితే దీనికోసం పుజారా చాలా కష్టపడ్డాడు. కాబట్టి కచ్చితంగా పుజారా మరికొన్ని సంవత్సరాల పాటు టెస్టు క్రికెట్ ఆడతాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ ఎదిగేలా మద్దతు ఇవ్వాలి. ఆసీస్, ఇంగ్లాండ్ పిచ్‌లకు మాలిక్ పేస్ చాలా చక్కగా సరిపోతుంది’’ అని ఎంఎస్కే ప్రసాద్ వివరించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Prithviraj Sukumaran: ‘సలార్’లో రెండేళ్ల కిందటే అవకాశం వచ్చింది.. కానీ!
-
Politics News
Aaditya Thackeray: ‘ఈ ద్రోహాన్ని మర్చిపోలేం.. ఇది నిజం, అబద్ధం మధ్య పోరు’
-
General News
TS Corona: తెలంగాణలో 500కు చేరువగా కరోనా కొత్త కేసులు
-
Viral-videos News
Viral Video: కొట్టుకుపోతున్న బిడ్డను కాపాడుకున్న తల్లి ఏనుగు.. వైరల్ వీడియో
-
General News
TS EAMCET: తెలంగాణలో ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
-
Movies News
social look: జాన్వీ, కీర్తి, రాశీ తెలుపు తళుకులు.. అనసూయ హాఫ్ శారీ మెరుపులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు