Hardik- Virat: హార్దిక్‌ పాండ్య - విరాట్ కోహ్లీ.. ‘షకబూబ్‌’ వీడియో వైరల్‌

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు సిద్ధమవుతోంది. అంతకుముందే ఆస్ట్రేలియాతో..

Published : 19 Sep 2022 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు సిద్ధమవుతోంది. అంతకుముందే ఆస్ట్రేలియాతో మూడు టీ20లను టీమ్ఇండియా ఆడనుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు మొహాలికి చేరుకున్నారు. ఆటవిడుపుగా హార్దిక్‌ పాండ్య, విరాట్‌ కోహ్లీ చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో నవ్వులు పూయిస్తోంది. 

నల్ల కళ్లజోడు పెట్టుకుని వెరైటీ హావభావాలతో వీరు చేసిన ‘షకబూమ్‌’ డ్యాన్స్‌ వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు రెండు గంటల్లోనే 3 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. జమ్మూ కశ్మీర్‌ క్రికెటర్‌ యుధ్‌వీర్‌ సింగ్‌ చరక్‌, నటుడు మెహర్జన్‌ మజ్దా ఈ వీడియోకు రియాక్ట్‌ అయ్యారు. కోహ్లీ ఈ వీడియోకు ‘షకబూమ్‌’ అంటూ లాఫింగ్‌ సింబల్‌ను కామెంట్‌ చేశాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని