
Shami-Bumrah partnership: అనుకోని హీరోలపై అభినందనల వెల్లువ
వీవీఎస్ లక్ష్మణ్, ద్రవిడ్ భాగస్వామ్యంతో పోల్చిన సెహ్వాగ్
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ వికెట్ పడగానే.. భారత్ ఇన్నింగ్స్ మరికొద్దిసేపట్లోనే ముగిసిపోతుందని చాలామంది భావించారు. కానీ మహమ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా జోడి అద్భుతం చేసింది. భారత్‌కు ఊహించని ఆధిక్యాన్ని ఇచ్చింది. రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను పటిష్ఠ స్థానంలో నిలిపిందీ జోడి. వీరిరువురి పోరాటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
షమి, బుమ్రా ఇన్నింగ్స్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో లక్ష్మణ్-ద్రవిడ్ నెలకొల్పిన రికార్డుస్థాయి భాగస్వామ్యంతో పోల్చాడు సెహ్వాగ్. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 445 పరుగుచేసి ఆలౌట్ అయ్యింది. భారత్ పేలవ ప్రదర్శనతో 171 పరుగులకే కుప్పకూలింది. దారుణ పరాభవం తప్పదని అందరూ భావించారు. కానీ వీవీఎస్ లక్ష్మణ్-ద్రవిడ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరు కలిసి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ గెలిచేలా చేశారు. వారి భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ.. పెవిలియన్‌కు చేరుకుంటున్న లక్ష్మణ్, ద్రవిడ్ ఫొటోల్లోని వారి ముఖాలను మార్చి చేసి షమి, బుమ్రా ఫొటోలను ఉంచాడు సెహ్వాగ్. వీరి కోసం చప్పట్లు కొడుతూనే ఉండాలి అని కొనియాడాడు.
వీరి భాగస్వామ్యాన్ని కీలకమైనదిగా పేర్కొనడం చాలా చిన్నవిషయం. ఈ భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వెల్‌డన్ షమి, బుమ్రా. - సచిన్
వీరి ఇన్నింగ్స్ చూస్తున్నంతసేపు మజా వచ్చింది. అద్భుతమైన భాగస్వామ్యం. వారికున్న అనుభవంతోనే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడారు. - లక్ష్మణ్
కష్టాల్లో ఉన్న టీమ్‌ఇండియాను షమి, బుమ్రా అసాధారణ ప్రదర్శన చేసి కాపాడారు. వీరి ప్రదర్శన జట్టు స్వభావాన్ని తెలుపుతోంది. దీన్ని ప్రత్యేకంగా మలుచుకోండి. - జయ్‌షా, బీసీసీఐ సెక్రెటరీ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.