WTC Final: పంత్‌, జడ్డూపైనే భారం!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. కివీస్‌ పేసర్లు కైల్‌ జేమీసన్‌, ట్రెంట్‌బౌల్ట్‌ రెచ్చిపోవడంతో తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయింది...

Updated : 23 Jun 2021 17:31 IST

విజృంభిస్తున్న కివీస్‌ పేసర్లు..

సౌథాంప్టన్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. కివీస్‌ పేసర్లు కైల్‌ జేమీసన్‌, ట్రెంట్‌బౌల్ట్‌ రెచ్చిపోవడంతో తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి భారత్‌ 55 ఓవర్లలో 130/5తో నిలిచింది. ప్రస్తుతం రిషభ్‌ పంత్‌ (28; 48 బంతుల్లో 4x4), రవీంద్ర జడేజా (12; 20 బంతుల్లో 2x4) క్రీజులో ఉన్నారు. కాగా, ఈ రోజు మొత్తం 98 ఓవర్ల ఆట జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 25 ఓవర్లు పూర్తయ్యాయి. ఇందులో భారత్‌ 66 పరుగులు చేసి మూడు వికెట్లు నష్టపోయింది. ఇంకా 73 ఓవర్ల ఆట సాగాల్సి ఉంది. మొత్తంగా రిజర్వ్‌డే రోజు గరిష్టంగా 83 ఓవర్ల ఆట జరగాల్సి ఉంది.

అంతకుముందు 64/2 ఓవర్‌నైట్ స్కోరుతో రిజర్వ్‌డే ఆరో రోజు ఆట కొనసాగించిన కెప్టెన్‌ విరాట్‌ (13; 29 బంతుల్లో), చెతేశ్వర్‌ పుజారా (15; 80 బంతుల్లో 2x4) విఫలమయ్యారు. ఆట ప్రారంభమైన అరగంటకే ఇద్దరూ ఒక్క పరుగు తేడాతో పెవిలియన్‌ చేరారు. జేమీసన్‌ వీరిద్దర్నీ ఔట్ చేయడం విశేషం. ఆ తర్వాత రహానె (15; 40 బంతుల్లో 1x4) వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా బౌల్ట్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ వెళ్లే బంతిని ఆడి కీపర్‌కు చిక్కాడు. దాంతో భారత్‌ 109 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన పంత్‌, జడేజా మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ ముగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని