
న్యాక్‌కు అసోచాం జాతీయ పురస్కారం
ఈనాడు, హైదరాబాద్: ఉపాధి కల్పనలో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచినందుకుగాను తెలంగాణలోని జాతీయ నిర్మాణ సంస్థ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్)కు అసోచాం జాతీయ స్థాయి పురస్కారం లభించింది. శుక్రవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఈ పురస్కారాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బేస్, శాసనసభాపతి రవీంద్రనాథ్‌లు.. న్యాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతికి అందజేశారు. న్యాక్‌కు ఉపాధి కల్పనలో ఉత్తమ సంస్థ పురస్కారం రావడంపై సంస్థ వైస్ ఛైర్మన్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.