న్యాక్‌కు అసోచాం జాతీయ పురస్కారం

ఉపాధి కల్పనలో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచినందుకుగాను తెలంగాణలోని జాతీయ నిర్మాణ సంస్థ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌)కు అసోచాం జాతీయ స్థాయి పురస్కారం

Published : 22 Jan 2022 05:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధి కల్పనలో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచినందుకుగాను తెలంగాణలోని జాతీయ నిర్మాణ సంస్థ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌)కు అసోచాం జాతీయ స్థాయి పురస్కారం లభించింది. శుక్రవారం ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా ఈ పురస్కారాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ రమేష్‌ బేస్‌, శాసనసభాపతి రవీంద్రనాథ్‌లు.. న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ బిక్షపతికి అందజేశారు. న్యాక్‌కు ఉపాధి కల్పనలో ఉత్తమ సంస్థ పురస్కారం రావడంపై సంస్థ వైస్‌ ఛైర్మన్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని