Bangalore: బెంగళూరు జట్టేంటో.. దాని పరిస్థితి ఏంటో..!
బెంగళూరు జట్టేంటో.. దాని పరిస్థితి ఏంటో.. ఎవరికీ అంతుబట్టదు. ఆ జట్టును నడిపించే యాజమాన్యానికి కూడా ఎందుకిలా జరుగుతుందనే కనీస ఆలోచన వస్తున్నట్లు కనిపించడంలేదు...
పదిలో నాలుగు సార్లు ఆ జట్టే..!
ఇంటర్నెట్‌డెస్క్: బెంగళూరు జట్టు పరిస్థితి ఒక్కోసారి ఎవరికీ అంతుబట్టదు. ఆ జట్టును నడిపించే యాజమాన్యానికి కూడా ఎందుకిలా జరుగుతుందనే కనీస ఆలోచన వస్తున్నట్లు కూడా కనిపించడంలేదు. పేరుకు గొప్ప జట్టు.. జట్టులో భీకర ఆటగాళ్లు ఉన్నా.. ఒక్క ట్రోఫీ సాధించలేదు. ఈ క్రమంలోనే టోర్నీ చరిత్రలో టాప్-10 అత్యల్ప స్కోర్ల జాబితాలో 4 స్కోర్లు ఆ జట్టే పేలవ ప్రదర్శన రికార్డులు నమోదుచేసింది. ఏటా భారీ అంచనాల నడుమ బరిలోకి దిగడం.. పలు పరాభవాలు ఎదుర్కోవడం.. మళ్లీ గాడిలో పడటం.. ఇక బాగా ఆడుతోందని అనుకునేలోపే అత్యంత పేలవ ప్రదర్శన చేయడం దానికి పరిపాటిగా మారింది. దీంతో ఘోర అవమానాల్ని మూటగట్టుకుంటూ అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బెంగళూరు 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ టోర్నీలో ఇప్పటివరకు నమోదైన టాప్-10 అత్యల్ప స్కోర్ల జాబితా ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
బెంగళూరు 49: ఈ టీ20 లీగ్‌లో 49 పరుగులకే ఆలౌటై టోర్నీ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదుచేసిన జట్టుగా బెంగళూరు పేలవ రికార్డు నెలకొల్పింది. 2017లో కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో 131 పరుగుల స్వల్ప ఛేదనలో బెంగళూరు పూర్తిగా తడబడింది.
రాజస్థాన్ 58: అత్యల్ప స్కోర్ల జాబితాలో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 2009లో బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప ఛేదనలో 58 పరుగులకు ఆలౌటైంది.
దిల్లీ 66: దిల్లీ 2017లో ఒకే వారంలో రెండుసార్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేసింది. దీంతో ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో తనే నిలిచింది. తొలుత కోల్‌కతాతో తలపడిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే ఆలౌటైన ఆ జట్టు తర్వాత ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 213 పరుగుల భారీ ఛేదనలో 66 పరుగులకే చాపచుట్టేసింది.
కోల్‌కతా 67: ఈ జాబితాలో కోల్‌కతా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 2008లో ముంబయితో ఆడిన గేమ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 67 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ముంబయి స్వల్ప లక్ష్యాన్ని సునాయాంగా ఛేదించింది.
బెంగళూరు 68: గతరాత్రి హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో బెంగళూరు 68 పరుగులకే కుప్పకూలి ఈ జాబితాలో ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే 2019లో చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో 70 పరుగులు, 2014లో రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో 70 పరుగులకే ఆలౌటై ఏడు, ఎనిమిది స్థానాలను కూడా ఆ జట్టే సొంతం చేసుకుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేయడం గమనార్హం.
పంజాబ్ 73: ఈ జాబితాలో పంజాబ్‌ది తొమ్మిదో స్థానం. 2017లో పుణె జట్టుతో ఆడిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 73 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పుణె ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కొచి 74: కొచి టస్కర్స్ 2011లో అత్యల్ప స్కోర్ నమోదు చేసి ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచింది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక కొచి 74 పరుగులకే కుప్పకూలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.