తేనె శ్రమ!

లొట్టలు వేసుకుంటూ తేనె తింటుంటాం గానీ దీన్ని తయారు చేయటానికి శ్రామిక, తుట్టెను సంరక్షించే తేనెటీగలు ఎంత శ్రమిస్తాయో తెలుసా? ఒక తెట్టెలోని శ్రామిక ఈగలు రోజుకు సుమారు 5 కోట్ల పువ్వుల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి!

Updated : 07 Dec 2022 06:24 IST

లొట్టలు వేసుకుంటూ తేనె తింటుంటాం గానీ దీన్ని తయారు చేయటానికి శ్రామిక, తుట్టెను సంరక్షించే తేనెటీగలు ఎంత శ్రమిస్తాయో తెలుసా? ఒక తెట్టెలోని శ్రామిక ఈగలు రోజుకు సుమారు 5 కోట్ల పువ్వుల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి! ఇవన్నీ కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకొని, మంచి పువ్వులను ఎంచుకుంటాయి. ఎగురుతూ, చప్పుడు, డ్యాన్స్‌ చేస్తూ పువ్వులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. సన్నటి గొట్టంలాంటి పొడవైన నాలుకతో పువ్వుల నుంచి మకరందాన్ని తాగుతాయి. ఈ మకరందం పొట్టలోకి చేరుకున్నాక.. అక్కడ వాటి జీర్ణాశయం సంక్లిష్ట చక్కెరలను మామూలు చక్కెరలుగా మారుస్తుంది. దీని మూలంగానే చక్కెరలు త్వరగా గడ్డ కట్టకుండా పలుచగా ఉంటాయి. శ్రామిక తేనెటీగలు తుట్టె వద్దకు చేరుకున్నాక తమ కడుపులోని తేనెను అక్కడి చిన్న తేనెటీగలకు అందిస్తాయి. ఇవి తుట్టెలోని షట్భుజి ఆకారంలోని గదుల్లో తేనెను నిల్వ చేస్తాయి. అంతేకాదు, రెక్కలను వేగంగా అల్లాడిస్తూ తేనెలోని నీరు ఆవిరయ్యేలా చేస్తాయి. తేనె ఎండిపోయాక గదిని మూసేస్తాయి. చలికాలంలో పువ్వులు పూయటం ఆగిపోయాక తేనె గదిని తెరచి, తేనెను తాగుతాయి. తేనె తయారీ వెనక ఇంత శ్రమ ఉంటుందన్నమాట. దీన్నే మనం సేకరించి వాడుకుంటుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని