వర్డ్ క్రాష్ అవుతోందా?
మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఏదో ముఖ్యమైన సమాచారాన్ని టైప్ చేస్తుంటాం. సేవ్ చేసే సమయంలో డాక్యుమెంట్ ఫ్రీజ్ అయితే? శ్రమంతా వృథా అవుతుంది. సత్వరం ముగించాల్సిన పనయితే ఇంకాస్త ఆందోళన పెరుగుతుంది.
మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఏదో ముఖ్యమైన సమాచారాన్ని టైప్ చేస్తుంటాం. సేవ్ చేసే సమయంలో డాక్యుమెంట్ ఫ్రీజ్ అయితే? శ్రమంతా వృథా అవుతుంది. సత్వరం ముగించాల్సిన పనయితే ఇంకాస్త ఆందోళన పెరుగుతుంది. తరచూ ఇలాంటి సమస్య ఎదురవుతోందా? దీన్ని తప్పించుకునే మార్గమేది?
డాక్యుమెంట్‌లో ఏదైనా సమస్య వస్తే దాన్ని గుర్తించి, మరమ్మతు చేసుకునే సామర్థ్యం వర్డ్‌లో ఉంది. కాబట్టి ముందుగా దీన్ని ప్రయత్నించటం మంచిది. వర్డ్ హోం పేజీలోకి వెళ్లి ‘ఓపెన్’ మీద క్లిక్ చేయాలి. తర్వాత ‘బ్రౌజ్’ ద్వారా డాక్యుమెంట్ ఉన్న ఫోల్డర్‌లోకి వెళ్లాలి. డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి కింద కనిపించే ‘ఓపెన్’ బాక్సు పక్కనుండే డ్రాప్‌డౌన్ బాణం గుర్తును తాకాలి. ఇందులో ‘ఓపెన్ అండ్ రిపేర్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఫైల్‌ను సేవ్ చేసుకొని, సమస్య పరిష్కారమయ్యిందేమో చూసుకోవాలి.
* కొన్నిసార్లు ప్రస్తుత ఫోల్డర్‌లో ఫైల్‌ను సేవ్ చేయటంలో ఇబ్బంది కలగొచ్చు. డ్రైవ్ స్లోగా ఉన్నా, కరప్ట్ అయినా, తీవ్రమైన ఎర్రర్లు ఉన్నా డాక్యుమెంట్ను సేవ్ చేసేటప్పుడు వర్డ్ ఫ్రీజ్ కావొచ్చు. ఇలాంటి సమయాల్లో వేరే డ్రైవ్‌లోకి డాక్యుమెంట్‌ను మూవ్ చేసుకొని చూడండి. అక్కడ దాన్ని ఓపెన్ చేసి ఎడిట్, సేవ్ చేసుకోవచ్చు.
* చాలా ఫైళ్లను సేవ్ చేసేటప్పుడు వర్డ్ క్రాష్ అవుతున్నట్టయితే ‘సేవ్ మోడ్’లో పెట్టుకోవటం మంచిది. స్టార్ట్ మీద క్లిక్ చేసి రన్ అని టైప్ చేయాలి. రన్ యాప్‌ను ఓపెన్ చేసి, దాని బాక్స్‌లో విండోవర్డ్/సేఫ్ అని టైప్ చేయాలి. తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైళ్లను ఓపెన్ చేసి, సేవ్ చేసుకోవాలి. దీంతో సమస్య పరిష్కార మయినట్టయితే యాడ్ ఇన్స్‌ను డిసేబుల్ చేసుకోవటం మంచిది. దీంతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. ప్రతీసారి సేఫ్ మోడ్‌ను వాడుకోవటం తప్పుతుంది. వర్డ్‌లో ‘ఫైల్’ మీద క్లిక్ చేయాలి. ‘ఆప్షన్స్’ మీద నొక్కితే వర్డ్ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో యాడ్-ఇన్స్ మీద నొక్కి, డ్రాప్‌డౌన్ మెనూ ద్వారా ‘వర్డ్ యాడ్-ఇన్స్’ను ఎంచుకొని, గో మీద క్లిక్ చేయాలి. తర్వాత రిమూవ్‌ను ఎంచుకుంటే యాడ్-ఇన్స్ డిసేబుల్ అవుతాయి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!