గ్యాస్, విద్యుత్తు లేకుండానే పదార్థాల వేడి
ఆహార పదార్థాలను, పానీయాలను వేడి చేయాలంటే పొయ్యి ఉండాల్సిందే. కట్టెలు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్.. ఇలాంటి ఇంధనాలను మండిస్తే గానీ మంట పుట్టదు.
ఆహార పదార్థాలను, పానీయాలను వేడి చేయాలంటే పొయ్యి ఉండాల్సిందే. కట్టెలు, బొగ్గు, కిరోసిన్, గ్యాస్.. ఇలాంటి ఇంధనాలను మండిస్తే గానీ మంట పుట్టదు. లేదూ విద్యుత్తు అయినా కావాలి. ఇవేవీ లేకుండా ఆహార పదార్థాలు వేడి అయితే? అదీ కేవలం నీటితోనే వేడి పుడితే? ఇలాంటి వినూత్న పరికరాలను ఐఐటీ దిల్లీ పరిశోధకులు రూపొందించారు. పవర్‌లెస్ హీటింగ్ సిస్టమ్ అని పిలుచుకునే ఇవి మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి బాగా పనికొస్తాయి. విద్యుత్తు సదుపాయం లేని చోట్ల, విద్యుత్తు ఉన్నా తరచూ అంతరాయం కలిగే చోట్ల, పొయ్యి ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో తేలికగా వాడుకోవచ్చు. ఇందులో పదార్థాల కోసం, నీటి కోసం రెండు వేర్వేరు పెట్టెలుంటాయి. అలాగే వేడిని పుట్టించే హీటింగ్ పట్టీ ఉంటుంది. ఈ పట్టీలో పర్యావరణ హిత ఖనిజాలు, లవణాల మిశ్రమం ఉంటుంది. దీన్ని పరికరం అడుగు భాగాన ఉండే బాక్సులో పెట్టి, దానిపై నీరు పోయాలి. అంతే హీటింగ్ పట్టీ వెడెక్కటం మొదలెడుతుంది. దీని మీద పదార్థాల బాక్సును పెడితే చాలు. పదార్థాలు, పానీయాలు 60-70 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత వరకు వేడెక్కుతాయి. పరికరాలు చాలా తేలికగా ఉంటాయి. ఎక్కడికంటే అక్కడికి ఇట్టే తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి వాతావరణాల్లోనైనా వాడుకోవచ్చు. తినటానికి సిద్దంగా ఉన్న పదార్థాలు, ఇన్‌స్టంట్ నూడుల్స్, టీ, కాఫీ వంటి వాటిని అప్పటికప్పుడు వేడి చేసుకోవచ్చు. ఒకసారి వాడిన తర్వాత పట్టీలో మిగిలిపోయే సహజ ఖనిజ మిశ్రమాన్ని ఎక్కడైనా పారేయొచ్చు. పర్యా వరణానికి ఎలాంటి హాని కలగదు. పైగా నేల సారమూ పెరుగుతుంది. గురుగావ్‌లోని ఆంచియేల్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ పరికరాల తయారీని ఆరంభించింది. నావికా దళానికి, కొన్ని ఆహార తయారీ సంస్థలకు వీటిని సరఫరా చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!