భూమికి ఆల్గే రక్షణ!

కిరణజన్య సంయోగక్రియ అనగానే మొక్కలు, చెట్లే గుర్తుకొస్తాయి. ఇవే కాదు.. సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సుల్లో జీవించే నాచు (ఆల్గే) కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది.

Updated : 21 Dec 2022 05:17 IST

కిరణజన్య సంయోగక్రియ అనగానే మొక్కలు, చెట్లే గుర్తుకొస్తాయి. ఇవే కాదు.. సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సుల్లో జీవించే నాచు (ఆల్గే) కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది. ఎండ, నత్రజని, ఫాస్ఫేట్‌, కార్బన్‌ డయాక్సైడ్‌లను సంగ్రహించుకొని వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో ఆక్సిజన్‌నూ ఉత్పత్తి చేస్తుంది. మన వాతావరణంలోని ఆక్సిజన్‌లో సుమారు 70% ఆల్గే నుంచే లభిస్తుంది! ఇది వాతావరణంలోంచి కార్బన్‌ను గ్రహిస్తుంది కాబట్టి వాతావరణ పరిరక్షణకూ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్‌హౌజ్‌ వాయువుల మోతాదులను తగ్గించి, భూతాపం పెరగకుండా చూస్తుంది. అంతేనా? వ్యవసాయ, ఆహార వ్యర్థాల వంటి వాటి నుంచి జీవ ఇంధనాలు తయారు చేయటానికీ ఆల్గేను వాడుకోవచ్చు. ఈ విధంగానూ భూతాపం తగ్గటానికి సాయం చేస్తుంది. ఆల్గేను ఏడు రకాలుగా విభజించుకోవచ్చు. గ్రీన్‌ ఆల్గే (క్లోరోఫైటా), యూగ్లినాయిడ్స్‌ (యూగ్లినోఫైటా), డయాటామ్స్‌ (క్రిసోఫైటా), ఫైర్‌ ఆల్గే (పైరోఫైటా), ఎల్లో గ్రీన్‌ ఆల్గే (గ్జాంతోఫైటా), బ్రౌన్‌ ఆల్గే (పేయియోఫైటా). వీటిల్లో డయాటామ్స్‌ ప్రత్యేకతే వేరు. దీన్ని గోల్డెన్‌ బ్రౌన్‌ ఆల్గే అనీ అంటారు. దీనికి మాత్రమే సిలికాతో కూడిన అస్థి పంజరం (ఫ్రుస్టులే) ఉంటుంది. డయాటామ్స్‌లో 20 లక్షలకు పైగా వేర్వేరు జాతులున్నాయని అంచనా. మన భూ వాతావరణంలోని ఆక్సిజన్‌లో 20-30% వీటి ద్వారానే లభిస్తుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని