మ్యాటర్‌ మహత్తు

మున్ముందు మ్యాటర్‌ గురించి చాలానే వినాల్సి రావొచ్చు.ఇది ఎన్నో పనులు.. ముఖ్యంగా స్మార్ట్‌హోం కనెక్టివిటీలో అద్భుతాలే చేయగలదు మరి.

Published : 04 Jan 2023 00:22 IST

మున్ముందు మ్యాటర్‌ గురించి చాలానే వినాల్సి రావొచ్చు.ఇది ఎన్నో పనులు.. ముఖ్యంగా స్మార్ట్‌హోం కనెక్టివిటీలో అద్భుతాలే చేయగలదు మరి. మ్యాటర్‌ అంటే ఒక ప్రామాణిక టెక్నాలజీ. కంపెనీలతో పనిలేకుండా స్మార్ట్‌హోం సాధనాలను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత.

కొత్త డిజిటల్‌ సాధనాలు మార్కెట్లోకి రాగానే అధునాతన ఫార్మాట్లకే మొగ్గు చూపుతాం. కానీ కంపెనీలు మారిపోతే చిక్కులు తలెత్తొచ్చు. ఉదాహరణకు స్మార్ట్‌ బల్బులే తీసుకోండి. అవి ఆయా హబ్‌లతోనే పనిచేస్తాయి. వేరే కంపెనీ స్మార్ట్‌ బల్బును సపోర్టు చేయవు. అందుకే ఒక బ్రాండ్‌ వస్తువును కొంటే వాటినే మరింత మెరుగు పరచుకోవాల్సి ఉంటుంది. ఆయా కంపెనీల స్మార్ట్‌ బల్బులు, స్విచ్చుల వంటివే కొనాల్సి ఉంటుంది. వేరే కంపెనీలకు చెందినవి కొంటే పనిచేయవు. ఇలాంటి ఇబ్బందులను తప్పించటానికి మ్యాటర్‌ తోడ్పడుతుంది. ఇదో కనెక్టివిటీ ప్రొటోకాల్‌. పరికరాలు దీన్ని సపోర్టు చేస్తే చాలు. కంపెనీలు వేరైనా ఎలాంటి ఆటంకమూ లేకుండా పనిచేస్తాయి. మనం శామ్‌సంగ్‌ స్మార్ట్‌ థింగ్స్‌, యాపిల్‌ హోంకిట్‌, గూగుల్‌ హోం వంటి ఎలాంటి ఫ్లాట్‌ఫామ్‌ను వాడుకున్నా ఇది అన్ని డిజిటల్‌ పరికరాలను అనుసంధానం చేసేస్తుంది. అలెక్సా ఎనేబుల్డ్‌ స్పీకర్‌తో బోర్‌ కొట్టిందనుకోండి. యాపిల్‌ హోంపాడ్‌ మినీకి మారిపోవచ్చు. అప్పటివరకు అలెక్సాతో పనిచేసిన స్మార్ట్‌ బల్బులు ఇప్పుడు సిరితో ఎంచక్కా పనిచేస్తాయి. భద్రత, గోప్యత విషయంలోనూ మ్యాటర్‌ పకడ్బందీగా పనిచేస్తుంది. ఇతర స్మార్ట్‌-హోం వ్యవస్థలకు తీసిపోదు. ఇదో సార్వత్రిక స్మార్ట్‌ భాషా వేదికగా ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు