ప్లాస్టిక్‌ బొగ్గు!

ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వియోగం మీద శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌ పరిశోధకులు మరో ముందడుగు వేశారు.

Published : 18 Jan 2023 06:05 IST

ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వియోగం మీద శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌ పరిశోధకులు మరో ముందడుగు వేశారు. తరచూ వాడే రెండు ప్లాస్టిక్‌లను (స్టైరోఫోమ్‌ ప్యాకింగ్‌లో వాడే పాలిస్టిరిన్‌, పెట్‌ బాటిళ్లు) బొగ్గుగా మార్చే విధానాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియలో ముందుగా మొక్కజొన్న ఆకులు, పొట్టు, గింజలు వలిచిన పొత్తుల వ్యర్థ మిశ్రమంతో (కార్న్‌స్టోవర్‌) పాస్టిక్‌ను కలుపుతారు. తర్వాత హైడ్రోథర్మల్‌ కార్బనైజేషన్‌ ప్రక్రియలో వేడి నీటితో అత్యధిక పీడనానికి గురిచేస్తారు. దీంతో ప్లాస్టిక్‌ పెద్దమొత్తంలో రంధ్రాలతో కూడిన బొగ్గుగా మారుతుంది. దీన్ని మట్టికి కలిపితే నేలలో నీరు ఎక్కువసేపు ఉండేలా, గాలిని సంగ్రహించేలా ఉపయోగించుకోవచ్చు. ఇది సహజంగా క్షీణిస్తుంది కాబట్టి భూసారమూ పెరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని