అనాది తోక చుట్టం!

చివరిసారిగా 50 వేల ఏళ్ల క్రితం కనిపించింది. అంటే ఆది మానవులు మాత్రమే చూశారన్నమాట. మరో సహస్రాబ్దిలో గానీ అది తిరిగి కనిపించదు.

Published : 18 Jan 2023 06:02 IST

చివరిసారిగా 50 వేల ఏళ్ల క్రితం కనిపించింది. అంటే ఆది మానవులు మాత్రమే చూశారన్నమాట. మరో సహస్రాబ్దిలో గానీ అది తిరిగి కనిపించదు. అందుకే సి/2022 ఈ3 (జెడ్‌టీఎఫ్‌) తోకచుక్క ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష ఫొటోగ్రాఫర్లకు ఆసక్తి కలిగిస్తోంది. ఆకుపచ్చ కాంతితో వెలుగులీనుతూ.. అంతర్‌ సౌర వ్యవస్థ ద్వారా ప్రయాణిస్తున్న ఈ అద్భుత తోకచుక్క జనవరి 12న సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చింది. ఫిబ్రవరి 2న భూమికి దగ్గరగా వస్తోంది. టెలిస్కోప్‌ లేకపోయినా దీన్ని మామూలుగానే చూడొచ్చు. సూర్యోదయానికి ముందు ఇది స్పష్టంగా కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చెబుతోంది. ఆకుపచ్చగా వెలిగే తోకచుక్క మధ్యభాగం, బూడిదరంగు తోక, పొడవుగా సాగే తోక చివరి భాగం అన్నీ కలిసి ఇదో అద్భుత వర్ణదృశ్యంగా కనువిందు చేయనుంది. దీన్ని జ్వికీ ట్రాన్సియెంట్‌ ఫెసిలిటీ (జెడ్‌టీఎఫ్‌) 2022, మార్చిలో తొలిసారిగా గుర్తించింది. అందుకే దీని పేరు చివర జెడ్‌టీఎఫ్‌ను జోడించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని