అంగారకుడి మీద ఎలుగుబంటి!

ఫొటో చూస్తుంటే అచ్చం ఎలుగుబంటి ముఖం మాదిరిగానే ఉంది కదా. ఇది ఇటీవల నాసా విడుదల చేసిన అంగారకుడి ఫొటో అని తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం.

Published : 01 Feb 2023 00:13 IST

ఫొటో చూస్తుంటే అచ్చం ఎలుగుబంటి ముఖం మాదిరిగానే ఉంది కదా. ఇది ఇటీవల నాసా విడుదల చేసిన అంగారకుడి ఫొటో అని తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం. అందుకే నెటిజన్లు దీన్ని చూసి తెగ అబ్బురపడిపోతున్నారు. కొందరు ఎలుగుబంటిలా కనిపిస్తోందంటే.. మరికొందరు గుడ్లగూబ ముఖంలా ఉందని అభిప్రాయపడుతున్నారు. కామిక్‌ పుస్తకాల్లోని ప్యాడింగ్‌టన్‌ బేర్‌ పాత్రలా ఉందన్నది మరికొందరి ఆలోచన. నిజానికి మధ్యలో ఉన్నది కుప్పకూలిన నిర్మాణమని, వీ ఆకారంలో ఉండటం వల్ల అది ఎలుగుబంటి ముక్కులా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. కళ్లలా ఉన్నవేవో బిలాలు. ఇక చుట్టూ ముఖంలా కనిపిస్తున్న గీతేమో కుంగిపోయిన బిలం తాలూకు అవశేషాలు. అంగారకుడి చుట్టూ 17 ఏళ్లుగా తిరుగుతున్న రీకానేసాన్స్‌ ఆర్బిటర్‌ దీన్ని చిత్రీకరించింది. ఇదంతా దీనిలోని హై రెజల్యూషన్‌ ఇమేజింగ్‌ సైన్స్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (హైరైజ్‌) కెమెరా మహత్మ్యం. ఇది మన కళ్ల మాదిరిగానే దృశ్య తరంగాలను పసిగడుతుంది. టెలిస్కోపిక్‌ కటకంతో మునుపెన్నడూ చూడని అంగారకుడి దృశ్యాలను అత్యంత నాణ్యతతో చూపెడుతోంది. తాజా ఎలుగుబంటి ముఖం ఆకారమే దీనికి నిదర్శనం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని