వైరస్‌ పితామహుడు

ఇప్పుడంటే రకరకాల వైరస్‌ల గురించి వింటున్నాం గానీ మొట్టమొదటగా గుర్తించిన వైరస్‌ పేరేంటో తెలుసా? టొబాకో మొజాయిక్‌ వైరస్‌.

Published : 08 Feb 2023 00:09 IST

ప్పుడంటే రకరకాల వైరస్‌ల గురించి వింటున్నాం గానీ మొట్టమొదటగా గుర్తించిన వైరస్‌ పేరేంటో తెలుసా? టొబాకో మొజాయిక్‌ వైరస్‌. దీన్ని ఇవానోస్కీ అనే శాస్త్రవేత్త 1892లో గుర్తించారు. అప్పట్లో ఇది పొగాకు చెట్లను నాశనం చేసేది. ఆకుల మీద టైల్స్‌ ఆకారంలో మచ్చలను కలిగించేది. బ్యాక్టీరియా లేదా విషతుల్యాలు దీనికి కారణం కావొచ్చని అనుకునేవారు. బ్యాక్టీరియాను వడగట్టే ఛాంబర్‌లాండ్‌ ఫిల్టర్‌ క్యాండిల్‌తో పొగాకు ఆకుల సారాన్ని వడపోసినా చీడ విస్తరిస్తోందని ఇవానోస్కీ గుర్తించారు. అయితే ఆయన తన ఆవిష్కరణను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. మార్టినస్‌ విలెమ్‌ బీజెర్నిక్‌ అనే శాస్త్రవేత్త 1898లో దీనిపై అధ్యయనం చేసి, వ్యాధికారక క్రిమిగా గుర్తించారు. ఇది ఏమాత్రం నశించకుండా వృద్ధి చెందుతోందని.. అందువల్ల చీడ సోకిన ఆకుల సారం తాకిన మిగతా మొక్కలూ దీని బారినపడుతున్నాయని గ్రహించారు. బ్యాక్టీరియా కన్నా చిన్నగా ఉండే దీనికి ఆయన పెట్టిన పేరు కాంటేజియమ్‌ వివమ్‌ ఫ్లూయిడమ్‌. అంటే సజీవ వ్యాధికారక ద్రవం అని. తర్వాత వైరస్‌ అనే పేరు పెట్టారు. అందుకే బీజెర్నిక్‌ను వైరస్‌ పితామహుడిగా భావిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని