ముద్దు పరికరం

ఫోన్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ అయితే వీడియోలో చూస్తూ ముచ్చటించుకోవచ్చు.

Published : 01 Mar 2023 00:10 IST

ఫోన్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ అయితే వీడియోలో చూస్తూ ముచ్చటించుకోవచ్చు. మరి ముద్దు పెట్టుకోగలిగితే? నిజంగా ముద్దు పెట్టినట్టు అనిపిస్తే? చైనాలోని చాంగ్‌చౌ యూనివర్సిటీ విద్యార్థి జియాంగ్‌ ఝోంగ్లీ అలాంటి అనుభూతి కలిగించే పరికరాన్నే తయారుచేశాడు. దీని ద్వారా సుదూరంగా ఉన్న జంటలు ముద్దు పెట్టుకోవచ్చు. సన్నిహిత సంబంధాన్ని కొనసాగించొచ్చు. అందుకే దీన్ని కిస్సింగ్‌ పరికరం అనీ పిలుచుకుంటున్నారు. తన స్నేహితురాలికి దూరంగా ఉంటున్న సమయంలోనే జియాంగ్‌కు ఈ పరికరాన్ని తయారుచేయాలనే ఆలోచన పుట్టుకొచ్చిందట. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందో తెలుసా? ఈ పరికరానికి పెదవుల ఆకారాలుంటాయి. మొబైల్‌ ఫోన్‌ అమర్చే వెసులుబాటు ఉంటుంది. పరికరాన్ని కొన్నాక మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తర్వాత పరికరానికి మొబైల్‌ ఫోన్‌ అమర్చి వీడియో కాల్‌ చేయాలి. ఒకరినొకరు చూస్తూ ముద్దు పెట్టుకోవటమే తరువాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు