మ్యాజిక్‌ ఎరేజర్‌ విస్తృతం!

మంచి ఫొటోగ్రఫీ ఫీచర్లకు గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లు పెట్టింది పేరు. ఇందులో మ్యాజిక్‌ ఎరేజర్‌ ఫీచర్‌ ప్రత్యేకతే వేరు.

Published : 01 Mar 2023 00:10 IST

మంచి ఫొటోగ్రఫీ ఫీచర్లకు గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లు పెట్టింది పేరు. ఇందులో మ్యాజిక్‌ ఎరేజర్‌ ఫీచర్‌ ప్రత్యేకతే వేరు. కృత్రిమ మేధతో పనిచేసే ఇది ఫొటోల నుంచి అనవసరమైనవాటిని చెరిపేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు ఈ ఫీచర్‌ పిక్సెల్‌ 6, పిక్సెల్‌ 7 ఫోన్లలోనే ఉండేది. ఇప్పుడు దీన్ని గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రయిబర్లందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలు రెండింటిలోనూ దీన్ని వాడుకోవచ్చు. గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే చాలు. మ్యాజిక్‌ ఎరేజర్‌ టూల్‌కు కొత్త హెచ్‌డీఆర్‌ వీడియో ఎఫెక్టులు, ప్రత్యేక కొలాజ్‌ శైలులనూ గూగుల్‌ జోడిస్తోంది. ఇది వీడియో ఎడిటింగ్‌ను మరింత మెరుగు పరుస్తుంది. పిక్సెల్‌ ఫోన్లు గలవారు గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ లేకపోయినా వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే మరింత సమగ్రమైన ఫీచర్లు కావాలంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు. క్లౌడ్‌ స్టోరేజీ కోసం గూగుల్‌ అదనంగా చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది. ఇది వీపీఎన్‌ను జోడించే స్థాయికీ చేరుకుంది. దీంతో గూగుల్‌ మీట్‌ మీద సుదీర్ఘ గ్రూప్‌ వీడియో చర్చల నిర్వహణకు వీలవుతుంది. ఫొటోలో వెనక దృశ్యాలను మసకగా చేయటం, ముఖాలు ఇంకాస్త స్పష్టంగా కనిపించేలా చూడటం వంటి ప్రీమియం గూగుల్‌ ఫొటోస్‌ ఫీచర్లనూ దీని ద్వారా వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని