భూమి ఎందుకు భ్రమిస్తుంది?

భూమి తన చుట్టూ తాను తిరగకపోతే సూర్యోదయం, సూర్యాస్తమయం.. పగలు, రాత్రి అనేవీ ఉండవు. కానీ భూమి భ్రమిస్తున్న విషయాన్ని ఇక్కడ్నుంచి మనం చూడలేం.

Published : 15 Mar 2023 00:04 IST

భూమి తన చుట్టూ తాను తిరగకపోతే సూర్యోదయం, సూర్యాస్తమయం.. పగలు, రాత్రి అనేవీ ఉండవు. కానీ భూమి భ్రమిస్తున్న విషయాన్ని ఇక్కడ్నుంచి మనం చూడలేం. మన కళ్లు గుర్తించలేనంత నెమ్మదిగా తిరుగుతుంది మరి. ఇంతకీ భూమి ఎందుకు భ్రమిస్తుంది? దుమ్ము, ధూళి ముద్దలు, వాయువు మేఘాలతో ఏర్పడింది కాబట్టి. అప్పటికే అవి భ్రమిస్తూ ఉన్నాయి. గురుత్వాకర్షణ ప్రభావంతో ఒక దగ్గరికి చేరుకున్నాయి. ఇవి భూమిగా పోగుపడిన తర్వాత కూడా అలాగే తిరుగుతున్నాయి. అంతరిక్షంలోని శూన్యంలో వీటి వేగాన్ని తగ్గించటానికి అవసరమైన ఘర్షణ ఏదీ లేదు. భూమి భ్రమిస్తోందనటానికి అలలు మంచి ఉదాహరణ. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పెద్ద అలలు ఎగిసిపడతాయి. చంద్రుడి గురుత్వాకర్షణ మహాసముద్రాలను తన వైపునకు లాక్కుంటుంది. దీంతో అవి చంద్రుడి వైపునకు వస్తాయి. కానీ ఇది తాత్కాలికమే. భూమి తిరుగుతుండటం అలలు తిరిగి వెనక్కి వెళ్తాయి. ఈ  అలల చక్రం మళ్లీ మళ్లీ కొనసాగుతూ వస్తుంటుంది. గంట గంటకూ అలల్లో వచ్చే మార్పులకూ భూ భ్రమణమే కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని