విపత్తుల అంచనాకు ఐఐటీ మండీ కొత్త ఆల్గోరిథమ్‌

ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు. వీటిని అంచనా వేయగలిగితే ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చు.

Published : 15 Mar 2023 00:04 IST

ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు. వీటిని అంచనా వేయగలిగితే ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చు. ఇలాంటి ఉద్దేశంతోనే ఐఐటీ మండి పరిశోధకులు వినూత్న ఆల్గోరిథమ్‌ను రూపొందించారు. కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో పనిచేసే ఇది ప్రకృతి విపత్తులను కచ్చితంగా అంచనా వేయటానికి తోడ్పడగలదు. దీన్ని కొండ చరియలు విరిగిపడటం మీద పరీక్షించారు కూడా. ఇది కొండ చరియలు విరిగిపడే అవకాశమున్న చోట డేటాను విశ్లేషించి, వాటిల్లో ఏవైనా తేడాలుంటే సవరించగలదు. వీటి ద్వారా పటాన్ని రూపొందించి, నిర్ణయాన్ని.. అంటే కొండ చరియలు విరిగిపడే అవకాశాన్ని అంచనా వేయగలదు. దీన్ని వరదలు, మంచు ఫలకాలు విరగటం వంటి విపత్తులను అంచనా వేయటానికీ ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని