ఎండలోనూ చల్లగా..
ఎండాకాలంలో ఏసీల నుంచి వచ్చే చల్లగాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ ఏసీలు చాలా విద్యుత్తును వాడుకుంటాయి. హానికర వాయువులను వెదజల్లుతాయి.
ఎండాకాలంలో ఏసీల నుంచి వచ్చే చల్లగాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ ఏసీలు చాలా విద్యుత్తును వాడుకుంటాయి. హానికర వాయువులను వెదజల్లుతాయి. ఇలాంటి ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతోనే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. ఎండ తగిలినా చల్లగా ఉండే వృక్ష ఆధారిత రంగు పొరను రూపొందించారు. ఇది ఏదో ఒకనాడు భవనాలు, కార్లు, పరికరాల వంటివి చల్లగా ఉండటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు. అదీ బయటి నుంచి ఎలాంటి ఇంధనం అవసరం లేకుండానే.
ఎండ తగిలితే చాలా పదార్థాలు వేడెక్కుతాయి. ఎందుకో తెలుసా? అవి సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కాంతి, కంటికి కనిపించే కాంతి, పరారుణ కాంతిని గ్రహించుకుంటాయి కాబట్టి. కానీ కొన్ని పదార్థాలు మాత్రం వీటిని ప్రతిఫలింపజేస్తాయి. పైగా పరారుణ రూపంలో తమలోని వేడిని వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి వెదజల్లుతాయి కూడా. అందువల్ల చల్లగా ఉంటాయి. సాధారణంగా పదార్థాలకు ఎరుపు వంటి రంగులను జోడిస్తే మరింత ఎక్కువ కాంతిని గ్రహించుకుంటాయి. దీనికి విరుద్ధంగా కాంతిని ప్రతిఫలింపజేసే రంగు పదార్థాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. అదీ కలపలోని రెండు రకాల సెల్యులోజ్ పదార్థాలతో. సెల్యులోజ్‌లోని రసాయన బంధాలు సరైన పరారుణ కాంతిని వెలువరించటానికి అనువుగా ఉంటాయి. కలప గుజ్జు లేదా పత్తి వంటి వాటి నుంచి సంగ్రహించే సెల్యులోజ్ నానోక్రిస్టల్స్ వర్ణద్రవ్యం లేకుండానే చాలా వర్ణాల్లో ప్రకాశించే రంగును సృష్టించగలవు. అందుకే కాంతిని ప్రతిఫలింపజేసే పలక మీద సెల్యులోజ్ నానోక్రిస్టల్స్‌ను అమర్చి.. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల పొరను పుట్టించారు. దీన్ని ఒకరకంగా సబ్బు నురగ మీది రంగులతో పోల్చుకోవచ్చు. వేర్వేరు కాంతి తరంగధైర్ఘ్యాలను పలు దిశలకు వెదజల్లటం ద్వారానే సబ్బు నురగ మీద ఇంద్రధనుస్సు రంగులు ప్రకాశిస్తుంటాయి. సెల్యులోజ్ నానోక్రిస్టల్స్‌తోనూ ఇలాగే రంగులను వెదజల్లే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటికి ఎండ తాకినా కూడా చుట్టుపక్కల పరిసరాల కన్నా సగటున 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత కలిగుండటం విశేషం. దీన్ని గోడల మీద పరికరాల మీద అమర్చితే అవి చల్లగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇప్పటికే ఇలాంటి రంగులు, పొరలు కొన్ని తయారవుతున్నాయి. కాకపోతే అవన్నీ తెలుపు లేదా అద్దంలాంటి మెరుపు వన్నె కలిగుంటాయి. గోడలు నీలం రంగులోనో, ఆకుపచ్చ రంగులోనో ఉండాలని కోరుకుంటే? ఇవేవీ ఉపయోగపడవు. ఇక్కడే కొత్తరకం రంగు పొర ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అయితే వాతావరణం వంటివి ఈ రంగుల పొర మీద విపరీత ప్రభావం చూపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి దీన్ని వాడకంలోకి తేవటానికి మరింత కృషి చేయాల్సిన అవసరముందని వివరి స్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్గా మారిన జడ్డూ పోస్టు
-
India News
Manipur: మణిపుర్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!