ఏఐ మోసాలకు గురికాకుండా..

కృత్రిమ మేధ (ఏఐ) వాడకం రోజురోజుకీ విస్తృతమవుతోంది. చాట్‌జీపీటీ, డాల్‌ ఈ వంటి ఓపెన్‌ ఏఐ పరిజ్ఞానాలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిటికెలో అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి.

Published : 19 Apr 2023 00:20 IST

కృత్రిమ మేధ (ఏఐ) వాడకం రోజురోజుకీ విస్తృతమవుతోంది. చాట్‌జీపీటీ, డాల్‌ ఈ వంటి ఓపెన్‌ ఏఐ పరిజ్ఞానాలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిటికెలో అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. టెక్స్ట్‌ ఆధారంగా బొమ్మలనూ రూపొందించేస్తున్నాయి. అయితే ఏఐ వాడకం మీద నియంత్రణ అవసరమని, దీన్ని దుర్వినియోగం చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు దీన్ని మోసం చేయటానికీ వాడుకుంటున్నారు. కృత్రిమ మేధ సాయంతో మోసగాళ్లు ఇటీవల అమెరికాలో ఒక అమ్మాయి గొంతును పునఃసృష్టించి, ఆమె తల్లికి ఫోన్‌ చేసి ఆపదలో ఉన్నట్టు భ్రమింపజేశారు. అనంతరం పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఈ సంఘటన చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏఐ యుగంలో మోసాల బారినపడకుండా చూసుకోవటమెలా అన్న ఆలోచనకు దారితీసింది.

* అజ్ఞాత కాల్స్‌, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వచ్చినా, పరిచయం లేనివారి నుంచి ఈమెయిళ్లు వచ్చినా అవతలి వారిని ధ్రువీకరించుకోకుండా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వద్దు. ఆర్థిక లావాదేవీలు చేయొద్దు.

* టూఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. ఖాతాల భద్రతకిది ఎంతగానో ఉపయోగపడుతుంది. పాస్‌వర్డ్‌ వేరేవాళ్లకు తెలిసినా కూడా కాపాడుకోవటానికి వీలు కల్పిస్తుంది.

* ఆపరేటింగ్‌ సిస్టమ్‌, అప్లికేషన్ల వంటి అన్నింటినీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. దీంతో హ్యాకర్లు, స్కామర్లు తేలికగా దాడి చేయకుండా కాపాడుకోవచ్చు.  

* ఏఐ మోసాలంటే ఏంటి? అవెలా జరుగుతాయి? అనే విషయాల గురించి అవగాహన కలిగుండాలి. అలాంటి మోసాలను గుర్తించటానికి, వాటి నుంచి తప్పించుకోవటానికిది అత్యవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని