రీల్స్‌ దిగుమతి ఎలా?

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌కు రోజురోజుకీ ఆదరణ పెరిగిపోతోంది. వీటిని యాప్‌లో చూడటం, షేర్‌ చేసుకోవటం తేలికే. ఇతర మాధ్యమాల్లో షేర్‌ చేసుకోవటం మాత్రం కష్టం.

Updated : 10 May 2023 03:35 IST

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌కు రోజురోజుకీ ఆదరణ పెరిగిపోతోంది. వీటిని యాప్‌లో చూడటం, షేర్‌ చేసుకోవటం తేలికే. ఇతర మాధ్యమాల్లో షేర్‌ చేసుకోవటం మాత్రం కష్టం. ఈ రీల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి థర్డ్‌ పార్టీ యాప్‌లు చాలానే ఉన్నాయి. అయితే ఇవి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించే ప్రమాదముంది. పైగా చాలా యాప్‌లు ప్రకటనలతో కూడి ఉంటాయి. మరి థర్డ్‌ పార్టీ యాప్‌లతో పనిలేకుండా ఇన్‌స్టా రీల్స్‌ను దిగుమతి చేసుకోవటమెలా?

* ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్‌ చేసి, డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అనుకునే రీల్స్‌ను ప్లే చేయాలి.

* ఇప్పుడు షేర్‌ గుర్తు మీద క్లిక్‌ చేయాలి. అక్కడ ‘యాడ్‌ రీల్స్‌టు యువర్‌ స్టోరీ’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని మీద క్లిక్‌ చేయాలి.

* తర్వాత ఓపెన్‌ అయ్యే పేజీలో పైన కుడివైపు మూలకు కనిపించే మూడు చుక్కలను క్లిక్‌ చేసి సేవ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

*అనంతరం స్టోరీని డిస్కార్డ్‌ చేయాలి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ ఫోల్డర్‌లో రీల్‌ సేవ్‌ అవుతుంది. గ్యాలరీ యాప్‌ ద్వారా దీన్ని చూసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు