టీకా పితామహుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌

మశూచి (స్మాల్‌పాక్స్‌) గడగడలాడిస్తున్న రోజులవి. ప్రపంచ జనాభాలో 10% మంది దీనికి బలయ్యారు. ఇన్‌ఫెక్షన్‌ త్వరగా సోకే పట్టణాల్లోనైతే సుమారు 20% మందిని పొట్టన పెట్టుకుంది.

Published : 17 May 2023 00:20 IST

శూచి (స్మాల్‌పాక్స్‌) గడగడలాడిస్తున్న రోజులవి. ప్రపంచ జనాభాలో 10% మంది దీనికి బలయ్యారు. ఇన్‌ఫెక్షన్‌ త్వరగా సోకే పట్టణాల్లోనైతే సుమారు 20% మందిని పొట్టన పెట్టుకుంది. దీని పీడ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించిన గొప్ప శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ జెన్నర్‌. బ్రిటన్‌ వైద్యుడైన ఆయనే టీకా భావనకు మార్గం వేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను రూపొందించారు. అదే మశూచి టీకా. పాలు పితికే వారికి మశూచి సోకదని అప్పట్లో నమ్మేవారు. దీనికి కారణం వీరిలో ఆవుల్లో తలెత్తే కౌపాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఉండటం. కౌపాక్స్‌ కూడా మశూచి వంటిదే. కాకపోతే తక్కువ తీవ్రత కలిగి ఉంటుంది. దీని బారిన పడ్డవారికి మశూచి నుంచీ రక్షణ లభిస్తోందని ఎడ్వర్డ్‌ జెన్నర్‌ భావించారు. ఈ ఊహా సిద్ధాంతంతోనే పాలు పితికే వ్యక్తి పొక్కుల నుంచి ద్రవాన్ని సేకరించారు. దీన్ని ఎనిమిదేళ్ల బాలుడి శరీరంలో ప్రవేశ పెట్టారు. వెంటనే అతడికి కౌపాక్స్‌ సోకింది. జ్వరం, కొద్దిగా అస్వస్థత కలిగాయి. కానీ పూర్తిస్థాయిలో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తలేదు. ఆరు వారాల తర్వాత బాలుడికి స్మాల్‌పాక్స్‌ వైరస్‌నూ బాలుడిలో ప్రవేశపెట్టారు. అయినా కూడా ఇన్‌ఫెక్షన్‌ ఏమీ తలెత్తలేదు. జెన్నర్‌ సిద్ధాంతం నిజమని రుజువైంది. తన పద్ధతికి ఆయన వాకా (ఆవు), వ్యాక్సీనియా (కౌపాక్స్‌) పదాలను కలిపి వ్యాక్సినేషన్‌ అని పేరు పెట్టారు. వైరస్‌ అనే పదాన్నీ జెన్నరే పరిచయం చేశారు. మే 17 ఆయన జన్మదినం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని